Breaking News... సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీశ్ రావు

by S Gopi |   ( Updated:2023-03-15 12:35:25.0  )
Breaking News... సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీశ్ రావు
X

దిశ, మంచిర్యాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్టిషన్ పాలిటిక్స్ కి పాల్పడుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో రూ. 8.50 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన సామాజిక ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందజేస్తూ న్యూట్రిషన్ ప్రభుత్వంగా పేరు పొందితే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలో కుల, మత, వర్గాల మధ్య చిచ్చులు పెడుతూ పార్టిషన్ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో గర్భిణీలు, బాలింతలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తల్లిదండ్రుల పాత్రను పోషిస్తున్నదని చెప్పారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రీషన్ కిట్టును సైతం అందజేసే మరో కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన మంచిర్యాల జిల్లాను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాని దేనినే విషయాన్ని జిల్లా ప్రజలు మర్చిపోవద్దని గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా 177 మెడికల్ కళాశాలలను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లాకి మెడికల్ కళాశాల, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి జిల్లాలోని పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ యాసంగిలో కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం గింజలను కొనకపోతే తెలంగాణ రాష్ట్రమే ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేసి మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుందని భరోసా ఇచ్చారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి పైపులు మార్చడానికి నిధులు మంజూరు చేసి మారుస్తామన్నారు. లిఫ్ట్ కి శాశ్వత ప్రతిపాదికన మరమ్మత్తులు చేయించి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ బాల్క సుమన్, కలెక్టర్ బాదావత్ సంతోష్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, స్థానిక మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, పలువురు ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story