గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

by Sridhar Babu |
గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, ఆసిఫాబాద్ : గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరు, సౌకర్యాలపై ఆరాతీశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని, కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.

Advertisement

Next Story