- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళాకారులు పోటీల్లో రాణించాలి.. ఏరియా పీఎం లక్ష్మణ్ రావు
దిశ, తాండూర్ : సింగరేణి కళాకారులు సాంస్కృతిక పోటీల్లో రాణించి సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని బెల్లంపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ (పీఎం) లక్ష్మణ్ రావు అన్నారు. గోలేటిలోని ఆఫీసర్స్ క్లబ్ లో సోమవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూ పీఎస్ అండ్ జీఏ) ఆధ్వర్యంలో నియర్ బై ఏరియా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ సింగరేణి సంస్ఠ సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు.
ప్రతిభ కనబరిచిన కళాకారులు భూపాలపల్లిలో జరిగే కంపనీ స్థాయి సంస్కృతిక పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మందమర్రి, బెల్లంపల్లి ఏరియా ఉద్యోగ కళాకారులు వివిధ విభాగాల్లో తమ పాటలు, సంస్కృతిక వాయిద్యాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు, శ్రీనివాసరావు, డీవైపీఎం రెడ్డిమల్ల తిరుపతి, డబ్ల్యూపీఎస్ గౌరవ కార్యదర్శి కిరణ్ కుమార్, రెండు ఏరియాల స్పోర్ట్స్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.