పారిశుద్ధ్య లోపంతో ప్రజల అవస్థలు

by S Gopi |   ( Updated:2022-12-09 15:04:03.0  )
పారిశుద్ధ్య లోపంతో ప్రజల అవస్థలు
X

దిశ, రామకృష్ణాపూర్: పురపాలకం రామకృష్ణాపూర్ స్థానిక రామాలయం ఏరియా డి టైప్ కాలనీల చుట్టూ ఏపుగా పిచ్చిమొక్కలు పెరగడంతో కాలనిలోకి పాములు రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం పట్టణ స్నేక్ సొసైటీ సభ్యులు నరేష్, వంశీ పామును పట్టుకోవడంతో ప్రజలు ఊపిరిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రామకృష్ణాపూర్ పురపాలకం వార్డులో కొన్ని సింగరేణి కాలనీలు ఉండగా మరికొన్ని పుర పరిధిలోని ఉండటంతో అటు సింగరేణి అధికారులు కానీ, ఇటు పుర అధికారులు పట్టణంలో కొన్ని ఏరియాల్లో చెట్ల పొదలు తొలగించడం, పారిశుద్ధ్య లోపాన్ని తొలగించే పని చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా పుర, సింగరేణి అధికారులు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story