- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర ఎనలేనిది
దిశ,ఆదిలాబాద్ : ప్రజల గొంతుకగా గళమెత్తిన ఉద్యమకారుడు గద్దర్ అని, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకం అని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవన్‌లో ప్రజాయుద్ధనౌక గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలిఖాన్ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. సంస్మరణ సభ నిర్వహణ కమిటీ కన్వీనర్, సభా అధ్యక్షులు సోగల సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గద్దర్ కూతురు వెన్నెలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గద్దర్, జహీరుద్దీన్ చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
వారి ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఒక మనిషి తనకోసం కాకుండా ప్రజల కోసం బతకాలని, అప్పుడే చరిత్రలో ఆయన గురించి మాట్లాడుకుంటారన్నారు. గద్దరు కూడా నిత్యం తనకోసం, కుటుంబం కోసం కాకుండా ఈ సమాజ శ్రేయస్సు కోసం పరితపించేవారన్నారు. ఎన్నో ప్రజా సమస్యలు ఆయన్ని బాధించాయని, వాటి నుండి విముక్తి కోసమే గజ్జకట్టి గళమెత్తారన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మించి తన ఆటపాటల ద్వారా చైతన్యం కల్పించారని గుర్తు చేశారు.
అన్ని విషయాల పట్ల సంపూర్ణ అవగాహనతో ఆయన పాటలు రాశారని గుర్తు చేశారు. అలాగే సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ సైతం పత్రిక ద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులకు, మేథావులకు, ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కథనాల ద్వారా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారన్నారు. వారి త్యాగాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారిద్దరి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం గద్దర్‌ను స్మరిస్తూ పాటపాడి సభలో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జహీరుద్దీన్ కుమారుడు ఫకర్ అలీఖాన్, టీజీఈజేఏసీ చైర్మన్ ఎస్.అశోక్, కోలేట్కర్ పరమేశ్వర్ పాల్గొన్నారు.
- Tags
- Gaddar