నష్టం వివరాలను పూర్తిస్థాయిలో అందించాలి

by Sridhar Babu |
నష్టం వివరాలను పూర్తిస్థాయిలో అందించాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ఆదిలాబాద్​ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన భవేశ్ మిశ్రా అన్నారు. ఆదివారం ప్రత్యేక అధికారి భవేశ్ మిశ్రా వర్షాల వలన జిల్లాలో జరిగిన నష్టం వివరాలు తెలుసుకునేందుకు జిల్లాకు వచ్చిన సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామల దేవి ప్రత్యేక అధికారి కి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముఖ్య ప్రణాళిక అధికారి, పంచాయతీ రాజ్, నీటిపారుదల, వ్యవసాయ శాఖ, మున్సిపల్, విద్య, వైద్య శాఖ, విద్యుత్ , రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డీడబ్ల్యూఓ డీటీడీఓ శాఖల అధికారులతో ప్రత్యేక అధికారి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆగస్టు , సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతి రైతు వివరాలు, ఇండ్లు కూలిపోయిన బాధితుల వివరాలు, నష్టంకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల వివరాలు, రోడ్లు, విద్యుత్, ప్రాజెక్టుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం డ్యామేజ్ అయిన ఇళ్లు, ఇరిగేషన్ ద్వారా మూడు ప్రాజెక్టులకు సంబంధించి మేజర్, మైనర్ డ్యామేజ్ అయిన ట్యాంకులు అదిలాబాద్, బోథ్, ఖానాపూర్ లకు సంబంధించిన వివరాలు, ఆర్ అండ్ బీ , ఈఈ పీ ఆర్, వ్యవసాయ, విద్యుత్ శాఖలకు సంబంధించిన పూర్తి నష్టం వాటిల్లిన వివరాల ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వినోద్ కుమార్, జివాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed