- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థుల పైనే దేశ భవిష్యత్తు..
దిశ, ఖానాపూర్ : దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏంకే ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ ఆయా మండలాల్లోని పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి బాలురే రేపటి పౌరులని అందుకే విద్యార్థులు చదువులో నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు.
విద్యార్థుల మేధాశక్తికి పదవ తరగతి మొట్టమొదటి మెట్టు అని, అందుకు విద్యార్థులు పదవ తరగతిలో ప్రతిభ చూపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ముందు ప్రోత్సహిస్తుందని , ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఎంఈఓ మధుసూదన్, ఎస్.ఐ శంకర్, బీఆర్ఎస్ నాయకులు కొక్కుల ప్రదీప్, పరిమి సురేష్, పుప్పాల శంకర్, రాజ గంగన్న, ఉపాధ్యాయులు బాలాజీ, వాల్గోటి కిషన్, విద్యార్థులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.