- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రామారావు పటేల్
దిశ,భైంసా : సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.సోమవారం ముధోల్ మండలంలోని బొరేగం,తానూర్ మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.ముధోల్ మండలం లో 15 వేల ఎకరాల్లో, తానూర్ మండలంలో 18 వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగు చేశారని,మార్కెట్లో ధర లేకపోవడంతోనే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు.క్వింటాలకు రూ.4892 మద్దతు ధర ఉందని 12 శాతం తేమ తో తమ పంటను తీసుకువచ్చి అమ్మాలన్నారు.
ప్రభుత్వం ఎకరానికి కేవలం 6క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులు సమస్యను తెలియజేయగా ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేసే విధంగా చూస్తానన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ డైరెక్టర్ గంగా చరణ్, మార్క్ ఫైడ్ డి ఎం.ప్రవీణ్ రెడ్డి, పిఎ సి ఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, నారాయణరావు పటేల్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సాయిరాం,నాగనాథ్ పటేల్ ,పీఎసీఎస్ డైరెక్టర్ భీమన్న,గోవింద్ రావు,గంగాధర్,ఆమోల్,పీఎసీఎస్ సీఈఓ భూమయ్య,ముధోల్ ఎక్స్ జడ్పీటీసీ నర్సా గౌడ్, మరియు ఏడిఏలు, ఏవో, ఏఈఓ,ఎఈ ఓ లు అలాగే పీఎసీఎస్ స్టాఫ్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు రైతులు, తదితరులు పాల్గొన్నారు.