పాఠశాల విద్యార్థుల బస్సుకు విద్యుత్ ఘాతం

by sudharani |   ( Updated:2022-12-01 16:01:29.0  )
పాఠశాల విద్యార్థుల బస్సుకు విద్యుత్ ఘాతం
X

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు సాయిబాబా ఆలయం సమీపంలో పాఠశాల బస్సుకు విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ శిశుమందిర్ పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు ప్రైవేట్ బస్సులో బాసర సరస్వతి ఆలయానికి గురువారం ఉదయం బయలుదేరారు. మధ్యాహ్నం బాసర ఆలయంలో పూజలు నిర్వహించి భోజనం చేశారు.

అనంతరం అక్కడి నుండి బయలుదేరి కుంటాల మండలం కల్లూరు సాయిబాబా ఆలయానికి బయలుదేరారు. ఆలయానికి వెళ్లే మార్గంలో తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండడంతో గమనించని డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. దింతో బస్సులో ఉన్న హరిచరన్, రణధీర్‌లకు పాదరక్షలు లేకపోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఒక్కసారిగా విద్యార్థులంతా ఉలిక్కిపడి భయబ్రాంతులకు లోనయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు వారిరువురిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed