రేచిని కార్యదర్శి పై డీపీఓ విచారణ

by Sumithra |   ( Updated:2023-02-21 13:57:55.0  )
రేచిని కార్యదర్శి పై డీపీఓ విచారణ
X

దిశ, తాండూర్ : మండలంలోని రేచిని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలపై మంగళవారం మంచిర్యాల డీపీఓ ఫణిందర్ విచారణ జరిపారు. మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దత్తుమూర్తి ఇంటి వద్ద, వ్యవసాయ క్షేత్రంలో పంచాయతీ ట్రాక్టర్, కార్మికులతో కార్యదర్శి పనులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నడని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయానికి డీపీఓ చేరుకుని రికార్డులు పరిశీలించి విచారణ నిర్వహించారు. అనంతరం డీపీఓ మాట్లాడుతూ విచారణ రిపోర్ట్ ను కలెక్టర్ కు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, సర్పంచ్ దుర్గుబాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story