ఎన్నిసార్లు సర్వే చేసినా అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు..?

by Sumithra |
ఎన్నిసార్లు సర్వే చేసినా అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు..?
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను అతి త్వరలోనే అర్హులకు అందించనున్నారు. అయితే అర్హులను గుర్తించడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారంటూ పలువురు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం పట్టణంలోని కిసాన్ గల్లి ప్రాంతంలో అర్హుల జాబితా అంటూ అధికారులు ఓ లిస్టును ఇచ్చారు. అయితే ఆ జాబితాలో అర్హులైన కొంత మంది పేర్లు రాలేదంటూ పలువురు ప్రజలు ఆందోళన చెందారు. ఎన్నిసార్లు అర్హులను గుర్తించే సర్వేలు చేపట్టినా అధికారులు ఎందుకు విఫలమవుతున్నారంటూ మండిపడ్డారు.

సగటు లిస్టులో అర్హులు కాకుండా అనర్హులు ఉన్నారంటూ వాదించారు. కొందరు ప్రజలు అయితే అప్లై చేసుకున్న వారికి గ్రామసభను ఏర్పాటుచేసినా సమాచారం లేదంటూ మండిపడ్డారు. అప్లై చేసుకున్న వారితో గ్రామసభను ఏర్పాటు చేస్తే అర్హులు, అనర్హులను గుర్తించే ప్రక్రియ సులభతరం అవుతుందని, ఇలా కాకుండా ఏదో తూతూ మంత్రంగా సర్వేలు చేపట్టి నిజమైన వారిని వదిలేస్తున్నారంటూ ఆవేదన చెందారు. అక్కడికి చేరుకున్న అధికారిని సైతం ప్రజలు అడగగా నిజమైన అర్హులు ఉంటే మరల ఒకసారి తాసిల్దార్ కార్యాలయానికి సంబంధిత పత్రాలు తీసుకొని రావాలని, అనర్హులుగా ఉన్న వారిని సైతం తెలపాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed