- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతికి పాల్పడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవద్దు
దిశ, నిర్మల్ రూరల్: అవినీతి ఆరోపణల ఉన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకోవద్దని ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. 2023లో డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎంపీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న కథనాలు ప్రచారం జరుగుతుంది. దీన్ని మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి కవితక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావులు ఆలోచించి అనినీతి ఆరోపణలు ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోబలం దెబ్బతినకుండా వ్యవహరించాలని అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్, మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బొల్లోజు నర్సయ్య, నాయకులు మారుతి, ముత్యం రెడ్డి, విలాస్ రావ్, భుమన్న, భోజన్న, పోతన్న, నక్క రాజన్న, చిన్నయ్య, నర్సాగౌడ్, సత్యపాల్ రెడ్డి, సురేందర్, శబాష్ రెడ్డి, తేజ, దిలీప్, లఖ్య నాయక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.