అవినీతి అధికారిపై సస్పెన్షన్‌ వేటు

by Sumithra |
అవినీతి అధికారిపై సస్పెన్షన్‌ వేటు
X

దిశ, తాండూర్ : జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీ నివేదికను అందించింది. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించామని పేర్కొన్నారు. కమిటీ నివేదిక మేరకు సస్పెండ్ చేశామని, విచారణ కమిటీ 15 రోజులలోగా పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

Next Story