- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పర్మిషన్లు ఇచ్చారు.. రక్షణను మరిచారు
దిశ, రామకృష్ణాపూర్ : దీపావళి టపాకాయల వ్యాపారానికి పురపాలకసంఘం, పోలీసులు, ప్రధానంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతులు తప్పనసరి. కానీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారా అని ప్రజల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రజల రక్షణను గాలికొదిలేసి, ప్రమాదకర స్థలంలో పర్మిషన్లు ఇచ్చేందుకు చకచకా ఆర్డర్లు అందించడంలో రాకెట్ బాంబుల్లా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
పట్టణంలోని స్థానిక సింగరేణి సూపర్ బజార్ ను అనుకొని ఇండియన్ గ్యాస్ గోదాం, రెండు పక్కల జనావాసాలు, పలు వ్యాపార సముదాయాలు ఉండగా గోదాం ముందే టపాకాయల వ్యాపారలతో ప్రమాదం పొంచిఉంది. సింగరేణి, పురపాలక అధికారులు మాత్రం కేవలం మూడు రోజుల వ్యాపారమే కదా అని ప్రజల రక్షణను పటాకుల మంటల్లో పడేసి ఏకపక్షంగా అనుమతులు ఇస్తున్నారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు గణగణ గంటలు మోగించుకుంటూ వచ్చి నీళ్లు చల్లి చేతులు తుడుచుకోవచ్చనే భావనను వదిలేసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలసిన అవసరం ఉందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.