రైతుల కోసమే మక్కల కొనుగోలు కేంద్రం : ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

by Shiva |
రైతుల కోసమే మక్కల కొనుగోలు కేంద్రం : ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
X

దిశ, ముథోల్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన ముథోల్ లోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. వర్షాల కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించాలని సూచించారు. అధికారులు తగు జాగ్రత్తలు పాటిస్తూ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలీద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాయిరాం, వైస్ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, గౌతం, పోతన్న యాదవ్, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story