పత్తి రైతులకు "మద్దతు" దక్కేన..

by Sumithra |
పత్తి రైతులకు మద్దతు దక్కేన..
X

దిశ, తలమడుగు : ప్రత్తి సంవత్సరం కూలీలకు, పెస్టిసైడ్స్ కు రేట్లు పెరుగుతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం రైతులకు అన్ని ఖర్చులు పెరుగుతున్నా పెరగనిది రైతు ఆదాయం ఒక్కటే. ఒకపక్క అంతుపట్టని వాతావరణం, మరోపక్క పెట్టుబడి పెరగడం రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పత్తి విత్తనాలు నాటిన నాటి నుండి పంట చేతికి వచ్చి మంచి ధర వచ్చే వరకు పత్తి రైతుకు దిన దిన గండంలా మారుతుంది. టైమ్ కు వర్షాలు రాక పత్తి పంట ఏపుగా పెరగడం లేదు. దాంతో దిగుబడి తగ్గుతుంది. మరో పక్క అనుకోకుండా అతి వర్షాలు పడడం వల్ల కాత పూత రాలిపోవడంతో కూడా దిగుబడి తగ్గి రైతుకు నష్టం చేస్తుంది.

కొంత మంది రైతులకు యాజమాన్య పద్ధతులు తెలియక పోవడం మరీ ముఖ్యంగా ఏ సమయంలో ఏం చెయ్యాలో సలహాలు సూచనలు ఇచ్చే వారు కరువయ్యారు. ఒకవేళ రైతు సమావేశాలు పెట్టినా అవి తూ తూ మంత్రంగానే సాగుతున్నాయి అనేది కొంత మంది రైతుల మాట. ఇక అన్నీ బాగుండి తీరా చేతికి పంట వస్తే మద్దతు ధర లేక పత్తి రైతు విలవిలలాడుతున్నాడు. ముక్యంగా తేమ శాతం పత్తి రైతుల నెత్తిన కుంపటిగా మారింది. మొదట చేతికి వచ్చే పంటలో కనీసం 10 శాతం తేమ ఉటుందని, అందువల్ల తేమ శాతంను 8 నుండి 10 కు పెంచాలని రైతులు వాపోతున్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు పత్తి రైతులను దృష్టిలో ఉంచుకొని గిట్టుబాటు ధర అయ్యే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed