నిర్మల్ లో ఉద్రిక్త పరిస్థితి

by Sumithra |   ( Updated:2022-10-07 10:34:04.0  )
నిర్మల్ లో ఉద్రిక్త పరిస్థితి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత దండోరా దీక్ష కార్యకర్తల గృహ నిర్బంధం, అరెస్టులకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రోజు నిర్మల్ పట్టణంలో నిర్వహించే దళితబంధు దండోరా దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉదయమే మహేష్ రెడ్డి నివాసానికి చేరుకొని దీక్షకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు.

జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నర్సాపూర్ మండల కేంద్రంలో దళితులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన దళిత దండోరా దీక్ష అనుమతి లేదని పోలీసులు మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనగా మహేశ్వర్ రెడ్డి దళిత మహిళలతో స్వగృహంలోనే దళిత దండోరా దీక్ష చేపట్టారు.

నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. మంత్రి తన స్వగ్రామమైన ఎల్లపెల్లి గ్రామంలో మొత్తం దళితులకు దళిత బంధు ఇచ్చారని, ఇతర గ్రామాలకు వచ్చేసరికి ఐదు నుండి ఆరుగురిని ఎంపిక చేసి దళిత బంధు ఇస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్క దళితుకి దళిత బంధు ఇచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన పోరాడుతుందని తెలియజేశారు.

Advertisement

Next Story