- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో అండర్ 19 బాలుర, బాలికల ఎస్జీఎఫ్ సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కం సెలక్షన్స్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. రెండు రోజులుగా పోటీలు హోరాహోరీగా సాగాయి. రాష్ట్ర స్థాయి లో నిర్వహించిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం పూర్వపు పది జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా ఆడారు. ముగింపు పోటీల్లో బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు విన్నర్ గా నిలిచాయి.
కాగా ద్వితీయ స్థానంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. అదేవిధంగా బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, సీఐ దేవయ్య, తాండూరు సీఐ కుమారస్వామి, మంచిర్యాల జిల్లా డీఐఈఓ అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు అబ్జర్వర్ గా నిజాంబాద్ జిల్లా నుండి పీడి గంగమోహన్, కన్వీనర్ గా ఆదిలాబాద్ జిల్లా పీడీఎన్ స్వామి వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా కాలేజీ గేమ్స్ సెక్రటరీ టోర్నమెంట్ ఆర్గనైజర్ బాబురావు, కె.రామ్మోహన్ రావు, ఎండీ. యాకూబ్, బండి రవి, చాంద్ పాషా, రాజ్ మహమ్మద్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, చిన్నక్క, యాదగిరి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.