- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
World Diabetes Day : ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు!
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ఇది క్రానిక్ అండ్ మెటబాలిక్ వ్యాధి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగిపోవడంవల్ల వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. రక్తనాళాలు, గుండె, కిడ్నీలు, కళ్లు, నరాలు దెబ్బతినే చాన్సెస్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దీనిబారిన పడినవారు అదుపులో ఉంచుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి మధుమేహానికి ముందే శరీరంలో కనిపించే ప్రీ డయాబెటిస్ మార్పులను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు
డయాబెటిస్ ప్రారంభానికి ముందు శరీరంలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించడం కష్టమే అయినప్పటికీ, అవగాహన కలిగి ఉండటంవల్ల సాధ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మెడ, మోచేతులు, చర్మం నల్లగా మారుతుంది. తీవ్రమైన అలసట, నిద్రలేమి వేధిస్తుంటాయి. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి, శరీర ఆకృతిలో మార్పు కనిపిస్తుంది. ఇవన్నీ డయాబెటిస్ సంభవించడానికి ముందు, అంటే ప్రీ డయాబెటిస్ సంకేతాలుగా అనుమానించి, మెడికల్ టెస్టులు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
మధుమేహం రాకుండా ఉండాలంటే ఆరోగ్య కరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిందే. ఇప్పటికే దీని బారిన పడినవారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. అదుపులో పెట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా హై షుగరింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ వంటివి తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజు కనీసం అరగంటకు పైగా వాకింగ్ చేయాలి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే అధిక బరువును, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యుల సలహాలను పాటిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.