Chirumarthi Lingaiah: ఎందుకు పిలిచారో నాక్కూడా తెలియదు

by Gantepaka Srikanth |
Chirumarthi Lingaiah: ఎందుకు పిలిచారో నాక్కూడా తెలియదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) స్పష్టం చేశారు. గురువారం విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping Case)‌లకు పాల్పడలేదని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో నాకు సంబంధం లేదు.. కావాలనే ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈనెల 9వ తేదీన నాకు నోటీసులు వచ్చాయి.. జ్వరం కారణంగా అప్పుడు హాజరుకాలేకపోయాను అన్నారు.

ఇవాళ హాజరవుతున్నాను.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను అని వెల్లడించారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలిచారు.. దేనికో నాకైతే తెలియదు. రాజకీయంగా ఎదుర్కోలేక డ్రామాలకు తెర లేపుతున్నారని చిరుమర్తి లింగయ్య సీరియస్ అయ్యారు. కాగా, ఏఎస్పీ తిరుపతన్నతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు నేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లింక్స్ ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story