- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హైదరాబాద్ రోడ్డు ఫై సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ చిందులు..
దిశ, సిటీ క్రైమ్ : హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల డ్యూటీకి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అడ్డుపడ్డాడు. అది కూడా కచ్చితంగా అమలు కావాల్సిన డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలకు ఈ ఏసీపీ బ్రేక్ వేయడంతో విషయం చర్చనీయాంశంగా మారింది."ఐ యామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నేను కూడా పోలీసు "అంటూ రోడ్డు ఫై విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఫై అరవడం వాహన దారుల ముందు పోలీసు ప్రతిష్టను దిగజార్చినట్లు అయ్యింది. ఈ సంఘటనలోని ఆర్గ్యుమెంట్ ను మొబైల్ ఫోన్ లో రికార్డు అవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నిజాయితీగా డ్యూటీ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ, సిబ్బంది ఫై నెటిజెన్ లు ప్రశంసలు కురిపించగా, అధికారి అనే అహంకారంతో చిందులేసిన ఏసీపీ ఫై ఘాటుగా విమర్శలు చేశారు.
వివరాల్లోకి వెళ్ళితే హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం రాత్రి ఉన్నతాధికారుల ఆదేశాలతో డ్రంకెన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను గమనించిన అటు వైపు వస్తున్న ఓ కార్ డ్రైవర్ కారును ఆపి పక్క సీట్లోకి మారాడు. ఇది గమనించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ కారును ఆపాడు. డ్రైవర్ సీట్ నుంచి మారిన వ్యక్తికి బ్రీత్ అనైలైజర్ తో పరీక్షలు నిర్వహించాలని సబ్ ఇన్స్పెక్టర్ ఆదేశించారు. అదే కారులో ఉన్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ బయటికి దిగి ఐయామ్ ఏసీపీ, పోలీస్ అంటూ కారు నడిపిన వ్యక్తికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయకుండా అడ్డుపడ్డాడు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బ్రీత్ అనైలైజర్ కు ఉదాల్సిందే అంటూ డ్యూటీలో ఉన్న పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారి, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కు వాగ్వివాదం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ లు తమ విధులను ఆడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం సేవించి కారు నడిపిన జైపాల్ రెడ్డికి పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. పోలీస్ డ్యూటీని అడ్డుకునేందుకు సిద్దిపేట ట్రాఫిక్ విభాగం ఏసీపీ సుమన్ కుమార్ తో పాటు కారులో ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదైంది.