- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
worry : దేవాలయ భూముల కబ్జాపై ఆందోళన
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దేవాలయ భూముల కబ్జా పై బజరంగ్దళ్, హిందూ ఉత్సవ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయ భూమి కబ్జాకు గురవుతుందని ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. భూ ఆక్రమణదారులు అభయాంజనేయ దేవాలయ భూముల అక్రమించుకోకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు, కబ్జాదారుల మధ్య వాగ్వాదం జరిగింది.
దేవాలయ భూములపై పూర్తిస్థాయిలో సర్వే చేపట్టకుండానే ఆక్రమణదారులు జేసీబీలతో చదును చేస్తుండగా దేవాదాయ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలోద్దీన్, పోలీస్లు వచ్చి కబ్జాదారులను నిలవరింప చేశారు. జేసీబీలను అక్కడి నుంచి తరలించారు. భూ కబ్జాదారులను అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దేవాదాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో అభయాంజనేయ దేవాలయ కమిటీ సభ్యులు, బజరంగ్ దళ్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.