- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలి
దిశ, ఆసిఫాబాద్: రైతుల వద్ద నుంచి పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి వ్యవసాయ మార్కెటింగ్, రవాణా శాఖల రైస్ మిల్లుల యజమానులతో వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 37 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు ప్రక్రియ చేపడతామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గోనె సంచులు సమకూర్చడంతో పాటు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులతో పర్యవేక్షిస్తూ ధాన్యం తూకం జరిగిన వెంటనే మిల్లులకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ల్లో నమోదు చేయాలన్నారు. విక్రయ సంబంధిత నగదును రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లించాలని, మే 15లోపు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.