ఉపాధి కూలీలకు పని చూపించాలి..

by Sumithra |
ఉపాధి కూలీలకు పని చూపించాలి..
X

దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం జిల్లా పాలన అధికారి వరుణ్ రెడ్డి పర్యటించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ లో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన ఫిష్ ఫండ్ పనులను పరిశీలించి కూలీల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల పెంపకం మంచి లాభదాయకమని అన్నారు.

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని, రైతులు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం చేపల పెంపకాన్ని నిర్వహిస్తున్న రైతుకు శ్రీనిధి సహకారం ద్వారా 50వేల రూపాయలు ప్రోత్సాహకం చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బొడ్డు గంగన్న, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఎంపీడీవో లింబాద్రి, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, ఏపీవో జయదేవ్, టీఏలు కాంతారావు, సుభాష్, గణేష్ ఎఫ్ఏలు కమలాకర్, జట్టి రాజు, బై కం రాజన్న, ఐకెపి ఎపిఎం రాజారాం, గ్రామస్తులు కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story