మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే ..

by Sumithra |   ( Updated:2024-10-23 09:51:44.0  )
మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే ..
X

దిశ, బోథ్ : మండలంలోని పొచ్చేర జలపాతం దగ్గర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అధికారులకు, నాయకులకు, మహిళలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. మహిళా శక్తి క్యాంటీన్ లో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు టిఫిన్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు మంచి భోజనం అందించాలని కష్టపడితే ఖచ్చితంగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed