- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా క్రిస్మస్ పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని సీఎస్ఐ క్యాథలిక్ బెల్లంపల్లి కల్వరి చర్చిల్లో క్రిస్టమస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరుల సామూహిక ప్రార్ధనలు మార్మోగాయి. బెల్లంపల్లి కల్వరి చర్చిలో జరిగిన వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు, క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు కాంపల్లి ఉమాకాంత్, మున్సిపల్ కౌన్సిలర్ బండి ప్రభాకర్, రాములు నాయక్, కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్, జాడి మహేష్, ముత్తే భూమయ్య, దూడం మహేష్, గోమాస భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.