బీసీ గురుకులాలకు అప్లై చేసుకోండి.. నిర్మల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్

by Javid Pasha |
బీసీ గురుకులాలకు అప్లై చేసుకోండి.. నిర్మల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్
X

దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లాలో ఉన్న నిరుపేద బీసీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే బీసీ గురుకులల ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ కోరారు. శుక్రవారండ ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీకి చెందిన విద్యార్థులు బీసీ గురుకులాల్లో 5,6,7,8 తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

అదేవిధంగా నిర్మల్ జిల్లా ఉన్న బీసీ జూనియర్ కళాశాలల్లో కూడా సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే 2023-24 విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర డిగ్రీ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న ఆయన.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారని చెప్పారు.

Advertisement

Next Story