తాళం వేసున్న రెండు ఇండ్లలో చోరి

by Sumithra |   ( Updated:2022-09-30 16:30:52.0  )
తాళం వేసున్న రెండు ఇండ్లలో చోరి
X

దిశ, రామకృష్ణాపూర్: కొన్నేళ్లుగా దొంగల అలికిడి లేకుండా పోయిందనుకుంటున్న తరుణంలో ఒక్కరోజే రామకృష్ణాపూర్ పట్టణంలోని ఒకే కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనం జరిగిన ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ కు చెందిన తిరుమల చారి మంచిర్యాల ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాలకు వెళ్లారు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి వెనక తలుపులు తెరిచి బీరువాలో 10 తులాల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. అదే కాలనీకి చెందిన అక్కల రమేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి ఇంటికి తాళం వేసి పట్టణంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంటి వెనక తలుపులు పగలగొట్టి బీరువాలోని లక్ష రూపాయల నగదు, రెండు తులాల బంగారం అపహరణకు గురైనట్లు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్లూస్‌ టీంతో రెండు ఇండ్లను పరిశీలించి ఫింగర్‌ప్రింట్స్‌ను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై అశోక్‌ పేర్కొన్నారు.

Advertisement

Next Story