- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంట గ్యాస్ పెంపు పై గరం గరం.. కేంద్ర తీరును నిరసిస్తూ మంత్రుల ఆందోళన
దిశ ప్రతినిధి, మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచే విధంగా పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ చౌరస్తా లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఆర్థిక, కార్మిక శాఖ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మంత్రులు హరీష్, మల్లారెడ్డిలు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రజలను రోజురోజుకు మోసం చేసి వస్తునే ఉందనీ మండి పడ్డారు. కేంద్రం చెప్పేది ఒకటి చేసేది ఒకటినీ ద్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసేదే చెప్తుదంన్నారు. అదానీ, అంబానీలకు దేశ ప్రజల సంపదను మోడీ దోచిపెడుతున్నాడని.. సామాన్య ప్రజలు వాడే గ్యాస్ పై రేట్ల మీద రేట్లు పెంచి మహిళల డబ్బును దోచుకుంటున్నాడు. మహిళలు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఆ వేడుకలు జరుపుకోకుండా గ్యాస్ రేట్లు పెంచి విషాదఛాయలు నింపి ఆనందం లేకుండా చేస్తున్న గొప్ప ప్రధానమంత్రి ఈ మోడీ అని అన్నారు.
మోడీ బొగ్గు బాయిలు, ఎయిర్పోర్టులు, ఇలా అన్ని అప్పనంగా ఆ దానికి దోచి పెట్టాడు. ఎన్నికలు వచ్చినప్పుడు రేట్లు తగ్గిస్తాం, ఎన్నికలు అయిపోగానే రేట్లు పెంచుతాం, ఇదే మోడీ బీజేపీ నినాదం అని ప్రశ్నించారు. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, మా ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతాం అని స్పష్టం చేశారు. మహిళలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ రేట్లను తగ్గించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
ప్రజలు వెంట ఉంటాం, ప్రజల కోసం పని చేస్తామని మంత్రులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ అనిత, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ లు పావని యాదవ్, కొండల్ రెడ్డి,వార్డు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు