మళ్ళీ ఊపందుకు చిల్లర కాంటా వ్యాపారం..

by Sumithra |
మళ్ళీ ఊపందుకు చిల్లర కాంటా వ్యాపారం..
X

దిశ, కోటపల్లి: కోటపల్లి మండలం ఎన్ హెచ్ 63 రహదారి పై పత్తి చిల్లర కాంటా వ్యాపారం ఊపందుకోవడంతో రైతన్నలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇక్కడ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పత్తి కొనుగోలు చేస్తున్నారు. అతి తక్కువ ధరలకు పత్తి కొనుగోలు జరిపిన చిల్లర వ్యాపారులు.. తూకాల్లో మోసాలు, గిట్టుబాటు ధర ఇవ్వక రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జోరుగా చిల్లర కాంటాల వ్యాపారం సాగుతున్నా మార్కెటింగ్‌ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. చిల్లర కాంటా వ్యాపారుల మోసాలతో సీజన్‌ ముగింపు సమయంలో పత్తి రైతులు తీవ్రంగా మోసపోతున్నారు. కొందరు చిల్లర వ్యాపారులు తూకంలో మోసం, ఎలక్ర్టానిక్‌ కాంటాల టాంపరింగ్‌ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు రోడ్డు వెంట విచ్చల విడిగా కాంటాలు పెట్టి పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

రైతు అవసరాల నిమిత్తం కోసం పత్తిని అమ్మడానికి తీసుకువస్తే వారి వెంట పడి మేము కొంటాం అని వాహనాలు అపి వారి దగ్గర నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ కాంటా పెడుతూ సంచి తరుగు అంటూ రైతులను దళారులు నట్టేట ముంచుతున్నారు. రైతు పత్తిని మార్కెట్ లోనై అమ్మకోవాలని రాష్ట్రా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ దళారులు రోడ్ల పై కాంటాలు ఏర్పాటు చేసి పత్తి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతున్నదని రైతులు వాపోయారు. పోయినసారి ఒక దళారీ పై కేసు నమోదు చేశారు. అయినా అధికారుల తనిఖీలు లేకపోవడంతో రోడ్డు వెంట విచ్చలవిడిగా పత్తి కాంటాలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో చిల్లర కాంట వ్యాపారం పై హల్‌చల్‌ చేసిన అధికారులు తర్వాత పట్టించుకోకపోవడంతో చిల్లర కాంట వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story