- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడు..ఆమె..ప్రేమ..చివరికి ఏమైందంటే
దిశ, బెల్లంపల్లి: నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన తిమ్మల మానసకు న్యాయం జరగాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో చేశారు. నెన్నెల గ్రామానికి చెందిన బొమ్మెన సంతోష్ గౌడ్ ఆరు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పి శారీరకంగా, మానసికంగా వాడుకొని మోసం చేశాడని ఆరోపించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన సంతోష్ గౌడ్ ను అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సంతోష్ గౌడ్ సోదరుడు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీష్ గౌడ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. గిరిజన మహిళకు న్యాయం జరిగేలా చూడాలని లేనిపక్షంలో నిరంతరం జిల్లాల వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆసాది మధు, జిల్లా గౌరవ అధ్యక్షులు బండి ప్రసాద్, కార్యదర్శి ఎరుకల నర్సింగ్, ఉపాధ్యక్షులు మద్దెల గోపి, పట్టణ అధ్యక్షులు బందెల మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం చక్రధర్, ఉపాధ్యక్షులు గీస రాజేశం, కాపురపు కిరణ్, గౌరవ సలహాదారులు నంది కొమురయ్య, నాయకులు అంగూరి సుభాష్, పైడిమల్ల చంద్రశేఖర్, మహిళా నాయకురాలు, దాసరి జయ, అనసూర్య, నేతకాని మహార్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ కలాలి నర్సయ్య, కార్యదర్శి గోమాస రాజం, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కలాలి భీమయ్య, మండల అధ్యక్షులు చదువుల వెంకట రమణ, యూత్ అధ్యక్షులు దుర్గం భాను ప్రసాద్ పాల్గొన్నారు.