నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్

by Sumithra |
నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్
X

దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండలంలోని వాగ్ధారి నుంచి సవర్గావ్ గ్రామం వరకు నూతన గ్రావెల్ రోడ్డు నిర్మణానికి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి వాగ్ధారి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలను చూసాం, ఆడిగాం, బ్రతిమిలాడిన కూడా మా సమస్యలను తీర్చలేదని అన్నారు. మమ్మల్ని కనీసం గ్రామస్తులుగా కూడా గుర్తించలేదని అన్నారు. కానీ తమ 20 ఏండ్ల కలను సాకారం చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి రుణపడి ఉంటామని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల సమయంలో చేస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా సవర్గావ్ రోడ్డు గురించే గ్రామస్తులు ప్రస్తావించేవారని, గ్రామస్తుల కోరిక మేరకు 4-5 రోజుల్లోనే గ్రామానికి 4 హైమాస్ లైట్లు పంపిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, తిరుమల గౌడ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, బాబులాల్, మారుతి, గులాబ్, చంద్రశేఖర్, మహేందర్, విలాస్, సంతోష్, సురేందర్, కమలాకర్, వెంకటేష్, రమణ, సంజీవ్, గంగాధర్, గోపి, మారుతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed