- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సీఎం కేసీఆర్ దండుపాళ్యం ముఠా నాయకుడు'
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఒకరి బ్యాంకు ఖాతాలో నుండి డబ్బులు ఇంకొకరు కాజేస్తే వారిని దొంగ అనక ఇంకేమంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో అన్నింట దోపిడీ జరుగుతున్నదని దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దండుపాళ్యం ముఠానాయకుడిగా మారాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాతో కలిసి ఆయన నాగోబా జాతరలో పాల్గొన్నారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో బండిసంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు ఫిబ్రవరి 3 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు చివరి సమావేశాలని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సమావేశాల్లో ఇక పాల్గొనరని పేర్కొన్నారు. నోరు తెరిస్తే అబద్ధం.. 100 కోట్లు ఇస్తా 1000 కోట్లు ఇస్తా అని చెప్పడమే తప్ప ఒక్క రూపాయి ఇవ్వడని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిజాం పై పోరాటం చేసిన వీరుడి గడ్డ కొమరం భీమ్ జోడేఘాట్ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఎన్ని కోట్లు ఇచ్చాడని ప్రశ్నించారు. నాగోబా అభివృద్ధి కోసం ఐదు కోట్లు ఇస్తానని ఇప్పటిదాకా చిల్లి గవ్వ ఇవ్వలేదని... ఆదివాసులే ఐదు కోట్లు సమకూర్చుకొని ఆలయం కట్టుకున్నారని ఇది ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
హిందూ ధర్మం హిందూ దేవాలయాలు ఈ ముఖ్యమంత్రి పట్టవని అదే నిజాం వారసుడు టర్కీలో చనిపోతే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువస్తే ఆయన స్వయంగా హాజరవడమే గాక అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిపించాడని విమర్శించారు. అదే దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబాకు వచ్చే తీరికమాత్రం ఆయనకు లేదని దుయ్యబట్టారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సీఎం ఇంకా ఎన్నాళ్ళని గిరిజనులను మోసగిస్తాడని ప్రశ్నించారు. ఆదివాసుల కోసం వారి అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా మోసగిస్తున్నాడని ఆరోపించారు.
పోడు భూములకు పట్టాలు ఇస్తానని కుర్చీ వేసుకుని కూర్చుండి సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటిదాకా ఒక్క గిరిజన కుటుంబానికి కూడా పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతానని మళ్లీ కొత్త రాగం మొదలు పెట్టాడని ఎన్నికలు వస్తేనే ఇవన్నీ గుర్తుకు వస్తాయని ఆరోపించారు. లక్షకోట్లు కాళేశ్వరంలో పెడితే అదనంగా ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆయన ఫామ్ హౌస్ కు మాత్రం నీళ్లు తరలించుకున్నాడని తీవ్రంగా విమర్శించారు.