- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nirmal: ఆ ప్లాన్‌నూ, జీవోను రద్దు చేయాల్సిందే: Etala Rajedhar
దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ సహా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు విషయానికి సంబంధించి కొత్తగా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ పూర్తిగా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మలుచుకున్నారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల భూములకు విలువ వచ్చేలా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగారు. తొలుత కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ పిలుపు నివ్వగా మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తన నివాసంలోనే ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డికి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మద్దతు పలికారు.
ఇవాళ నిర్మల్ వెళ్లిన ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో 220ని కూడా రద్దు చేయాలన్నారు. నిర్మల్‌లో మాస్టర్ ప్లాన్ పేరిట భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నిర్మల్ పట్టణంలోనే కాదని.. హైదరాబాద్ చుట్టు పక్కల భూములను కూడా యదేచ్ఛగా లాక్కుంటున్నారని ఈటల ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాలు, నిరసనలు చేసే అధికారం ప్రతిపక్షాలకు లేకుండాపోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిజాం చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.