- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెరుగైన వైద్యం అందించాలి.. అధికారులకు కలెక్టర్ ఆదేశం
దిశ, ఆదిలాబాద్ః జిల్లాలో తరచుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గురువారం రిమ్స్ లో వైద్య సౌకర్యాలపై అరా తీసేందుకు ఆకస్మికతనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అన్ని విభాగాల్లో పర్యటించి రోగులను వైద్య సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. పిల్లల వాడు విభాగానికి వెళ్లిన ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారికి ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నారు... అనే విషయాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మొదటి, రెండవ, మూడవ అంతస్తులలో పర్యటించి అన్ని విభాగాలను పరిశీలించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రింట్స్ డైరెక్టర్ కు సూచించారు. అసలే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, అంటువ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులు కూడా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే రిమ్స్ లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, రోగులకు నాసీరకం భోజనం పెడుతున్నారని, ముఖ్యంగా నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయడం లేదని యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డితో పాటు పలువురు రోగులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆరా తీయగా మెనూ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని, నిబంధనల ప్రకారం రోగులకు మెనూ ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.