బతుకమ్మా.. నీ పాటకు దరువుల మోతమ్మ

by Sumithra |
బతుకమ్మా.. నీ పాటకు దరువుల మోతమ్మ
X

దిశ, బెల్లంపల్లి: మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను తెలంగాణ ఆడపడుచులు అట్టహాసంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఎంగిలిపూల బతకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. బెల్లంపల్లిలోని మార్కెట్ ప్రాంతంలో పూల అమ్మకాలతో సందడిగా మారింది. పట్టణంలోని అన్ని బస్తీలు, బజార్ ఏరియాల్లో మహిళల ఎంగిలి పూల వేడుకల్లో ఉత్చాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలు పిల్లలు ఆడారుపాడారు. పిల్లలు పెద్దలు అనే తేడాలేకుండా అందరూ ఎంగిలి పూల సంబురాల్లో మునిగిపోయారు. ఎంగిలిపూల పండుగను వైభవోపేతంగా జరుపుకున్నారు.

Advertisement

Next Story