నిర్మల్ చేరుకున్న బండి సంజయ్.. BJP శ్రేణుల ఘన స్వాగతం

by Satheesh |   ( Updated:2022-11-28 15:21:09.0  )
నిర్మల్ చేరుకున్న బండి సంజయ్.. BJP శ్రేణుల ఘన స్వాగతం
X

దిశ, ప్రతినిధి నిర్మల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లాలోని బైంసా నుంచి ఐదవ విడత పాదయాత్ర నిర్వహించేందుకు గాను ఖరారైన పర్యటన ప్రకారం సోమవారం భైంసాలో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన పర్యటన రీ షెడ్యూల్ అయింది. ఇందులో భాగంగానే ఆయన నేరుగా సారంగపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయానికి బయలుదేరారు. కరీంనగర్ నుంచి మహా పోచమ్మ ఆలయానికి వెళుతూ నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ మంచిర్యాల చౌరస్తాలో కాషాయ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి బండి సంజయ్‌ను స్వాగతించారు. ఆయన నిర్మల్ జిల్లాకు రాష్ట్ర అధ్యక్ష హోదాలో తొలిసారిగా రావడంతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో స్వాగతం పలికారు.

Advertisement

Next Story