- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయ టెండర్ నిర్వాహకుడిపై దాడి
దిశ, భైంసా: బాసర ఆలయ టెండర్ నిర్వాహకుడిపై ప్రైవేట్ హోటల్ నిర్వాహకుడి కుటుంబ సభ్యుడు ఒకరు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాసర గోదావరి ఘాట్ పై ఆలయం ఆధ్వర్యంలో గత ఏప్రిల్ నెలలో హోటల్ టెండర్ నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ టెండర్లలో సంవత్సరాని 22 లక్షల చొప్పున టెండర్ దక్కించుకున్న గత మే నెల నుండి హోటల్ నిర్వహిస్తున్నాడు. అక్కడే ఘాట్ బయట ఉన్న ప్రైవేట్ హోటల్ నిర్వాహకుడు ఆలయ టెండర్ హోటల్ స్థాపించినప్పటి నుండి తనకు గిరాకీ అవడం లేదని, ఘాట్ బయట గల రోడ్డుపై హోటల్ నిర్వహిస్తున్నాడనీ బాధితుడు వాపోయారు. ఈ విషయమై ఆలయ టెండర్ నిర్వాహకులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కక్ష పెంచుకున్న ప్రైవేట్ హోటల్ వాళ్ళు గత ఆదివారం ఉదయం టెండర్ నిర్వాహకులపై కుర్చీతో దాడి చేసి హత్య యత్నానికి పాల్పడ్డడనీ బాధితుడు వాపోయాడు.
ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయిందని వీటిని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసినట్లు బాధితుడు తెలిపారు. ప్రైవేట్ హోటల్ యజమానికి ఉన్న పలుకుబడి కారణంగా బాధితుడి ఫిర్యాదును సైతం సంబంధిత అధికారులు లెక్క చేయకుండా ప్రైవేట్ హోటల్ యజమానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి సైతం తీసుకువెళ్లగా ఆలయ ఈవో విజయ రామారావు స్థానిక ఎమ్మార్వో పవన్ చంద్ర, ఎస్సై గణేష్ లతో కలిసి సోమవారం ప్రైవేట్ హోటల్ యజమాని తో మాట్లాడే ప్రయత్నం చేశారు. గతంలో సైతం దర్జాగా రోడ్డు కబ్జా అన్న శీర్షికన పలు వార్త పత్రికల్లో కథనాలు వెలువడ్డ సంబంధిత అధికారులు ఎవరు నోరు మెదపక పోగా, ఈసారి ఏకంగా టెండర్ నిర్వాహకుల పైనే దాడి యత్నానికి పాల్పడిన ఘటన ను సైతం పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తొందర్లోనే సమస్య కొలిక్కి వస్తుంది: బాసర ఎస్సై
ఆలయ టెండర్ నిర్వాహకుడు జరిగినటువంటి ఇష్యూ మా దృష్టికి వచ్చింది. తొందర్లోనే సమస్య కొలిక్కి వస్తుంది.ఇప్పటికే ఆలయ ఈ.ఓ, ఎమ్మార్వో సైతం ఇట్టి విషయం పై దృష్టి సాధించారు. సంబంధిత సీసీ ఫుటేజ్ లను పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని బాసర ఎస్సై తెలిపారు.