- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కబ్జా చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు
దిశ,బెల్లంపల్లి : కబ్జా చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ లీడర్లపై మావోయిస్టు పార్టీ చేసిన భూ కబ్జాల ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ మేరకు క్యాంప్ ఆఫీసులో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనుచర వర్గం భూకబ్జాలకు పాల్పడుతుందని ఇటీవల మావోయిస్టు పార్టీ కోల్బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ చేసిన ఆరోపణలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించారు. బెల్లంపల్లిలో కబ్జాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని అన్నారు. తన పార్టీకి చెందిన వారైనప్పటికీ విచారణ చేసి భూ కబ్జాల నిగ్గు తేలుస్తానని స్పష్టం చేశారు.
భూ కబ్జాలపై విచారణకు సమావేశంలోనే అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ విచారణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లు రూఢీ అయితే ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటు లేదని తెలిపారు. మచ్చలేని రాజకీయ జీవితం తనదని పేర్కొన్నారు. చెన్నూరు లో మంత్రిగా పనిచేసిన తన రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా లేదన్నారు. కాక వెంకటస్వామి కుమారుడిగా ప్రజాసేవకు అంకితమై పని చేస్తున్నానన్నారు. బెల్లంపల్లి ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచి పదవి అప్పజెప్పారని గుర్తు చేశారు.
బెల్లంపల్లి ప్రజల రుణం తీసుకునేందుకు సీన్సియర్ గా పనిచేస్తున్నా అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూ కబ్జాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదన్నారు. అలాగే కబ్జా చేసిన భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు, జిల్లా నాయకులు మునిమంద రమేష్ పాల్గొన్నారు.