ధాన్యం దింపుకోవడంలో ఆలస్యం చేయొద్దు.. అదనపు కలెక్టర్

by Sumithra |
ధాన్యం దింపుకోవడంలో ఆలస్యం చేయొద్దు.. అదనపు కలెక్టర్
X

దిశ, లోకేశ్వరం : కొనుగోలు కేంద్రాల నుండి గోదాములకు లారీల్లో తరలించిన ధాన్యాన్ని దింపుకోవడంలో ఆలస్యం చేస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ రాంబాబు హెచ్చరించారు. దీనితో ప్రభుత్వం లేదా రైతులపై అదనపు భారం పడే ఆస్కారం ఉందని, గోదాములకు వచ్చిన లారీల నుండి చేరుకున్న సమయం నుండి 6 గంటల లోపు ధాన్యాన్ని దించేలా ఏర్పాట్లు చేసుకోవాలని గోదాముల నిర్వాహకులకు సూచించారు. లోకేశ్వరం మండలంలోని నగర్ లో గల గోదాములను ఆయన సోమవారం తహసీల్దార్ సరితతో కలిసి పరిశీలించారు.

అలాగే గత సీజన్లో ఈ గోదాములకు ధాన్యం ఎంత తరలించారు, ఈ సీజన్లో తరలించేందుకు స్థలం ఎంత ఉంది అనే తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళ , తహసిల్దార్ సరిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story