ఏసీబీ దూకుడు... న‌లుగురు అధికారులు అరెస్టు

by Naresh |
ఏసీబీ దూకుడు... న‌లుగురు అధికారులు అరెస్టు
X

దిశ‌, మంచిర్యాల బ్యూరో: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు క‌ల‌క‌లం సృష్టించాయి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంప‌ల్లి ఎంపీడీవో కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటుండ‌గా వారికి కాసిపేట పంచాయ‌తీ రాజ్ ఏఈ పరంజ్యోతి చిక్కారు. ఏఈ పాత పనికి బిల్లు కోసం లంచం డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించారు. దీంతో ఏఈ పెర్క‌ప‌ల్లి పంచాయతీ సెక్రెటరీ వీరబాబు ద్వారా రూ. 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి చిక్కారు. దీంతో ఏఈ పరం జ్యోతి, పెర్కపల్లి పంచాయతీ కార్యదర్శి వీర బాబును అదుపులోకి తీసుకుని ఏ సీ బీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.ఇక నిర్మ‌ల్ జిల్లాలో క‌డెంలో సైతం ఏసీబీ దాడులు నిర్వ‌హించారు. కడెం తహ‌సీల్దార్ కార్యలయంలో త‌హ‌సీల్దార్ రాజేశ్వ‌రితో పాటు డీటీ ని సైతం అరెస్టు చేశారు. భూమి రిజిస్ట్రేష‌న్ కోసం డ‌బ్బులు డిమాండ్ చేయ‌డంతో ఇక్క‌డ కూడా బాధితులు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో బుధ‌వారం డీటీ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. త‌హ‌సీల్దార్ రాజేశ్వ‌రి, డీటీ చిన్న‌య్య‌ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed