ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి యువకుడి మృతి

by Shiva |
ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి యువకుడి మృతి
X

దిశ, బెల్లంపల్లి: ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి అబ్దుల్ జహీర్(27) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు అబ్దుల్ జహీర్, కాగజ్ నగర్ పట్టణం 14 వార్డు కు చెందినవాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story