- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మెరుగైన విద్యను అందించేందుకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం లోగోను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలో యాదవ సంఘం భవనంలో సోమవారం తెలంగాణ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు వెంకట్ నారాయణ, బి రాహుల్‌లు మాట్లాడుతూ… ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, శాస్త్ర విద్యా విధానం అమలు చేయాలని, కామన్ స్కూల్ విద్యా విధానం కోసం కృషి చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ స్టూడెంట్ ఫోరం టీఎస్ఎఫ్ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి రాహుల్, ఉపాధ్యక్షుడు సంతోష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.