- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కమిటీ
దిశ, ఆదిలాబాద్ : మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక జిల్లా అధికారుల కమిటీని నియమించినట్లు బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ కమిటిలో జిల్లా పరిషత్ సీఈఓ జితేందర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి బి. మోహన్ మెంబర్లుగా, కన్వీనర్ గా జిల్లా ట్రెజరీ అధికారి హారిక, సభ్యులుగా జిల్లా ఎన్నికల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు, ఆధారాలు లేకుండా నగదును తరలించే క్రమంలో అధికారులు స్వాధీనం చేసుకుంటే కమిటీ సభ్యులు మోహన్ ను సంప్రదించాలని సూచించారు.
రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలిస్తే సరైన ఆధారాలు, నగదు స్వాధీన పంచనామా పత్రాన్ని చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన ఆదిలాబాద్ సరిహద్దులో నగదు, వస్తువులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. నగదును స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతా నం. 42354484021 లో జమచేసి దాని డిపాజిట్ రసీదు, పంచనామాను జిల్లా ఫిర్యాదుల కమిటీ కన్వీనర్ బి. మోహన్ ను 8328683964 సెల్‌కు సంప్రదించాలని సూచించారు. దీని ఒక కాపీని సంబంధిత వ్యక్తికి సమర్పించాలని అన్నారు.