- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Arvind : కేటీఆర్ కు కొవ్వు తగ్గలేదు..జైలులో వేసి కరిగించాలి : ఎంపీ అర్వింద్
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిన ఆ పార్టీ నేత కేటీఆర్(KTR)కు కొవ్వు తగ్గలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్(MP Arvind Kumar) విమర్శించారు. లగచర్లలో కలెక్టర్ పై కుట్రలో కేటీఆర్ హస్తముందన్నారు. ఈసంపల్లిలో నాపై జరిగిన దాడిపై కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని, దీనిపై పార్లమెంటు ప్రివిలైజేషన్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్నికల్లో 38సీట్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల్లో ఓడినా కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదని అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడని విమర్శించారు.
కేటీఆర్ ఢిల్లీకి వెళితే తెలంగాణ ప్రకంపనలంటూ ట్వీట్ చేసిన తీరు ఆయనలోని అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు, పార్టీలను ప్రజలు ఐదేళ్లకు ఎన్నుకుంటారని, పని చేయకపోతే ప్రజలే దించేస్తారని, దాడులు ఎందుకని ప్రశ్నించారు. లగచర్ల, ఈసంపల్లి ఘటనలో ఎంక్వయిరీ పక్కాగా చేసి కేటీఆర్ ను జెలులో వేయాలన్నారు. చెల్లి కవితను వేసినట్లుగానే కేటీఆర్ ను జెలులో వేసి, కొవ్వు కరిగించాలని అర్వింద్ ప్రభుత్వానికి సూచించారు.