Vote jihad: మహారాష్ట్రలో ఓటు జిహాద్‌ను అనుమతించబోము.. బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే

by vinod kumar |
Vote jihad: మహారాష్ట్రలో ఓటు జిహాద్‌ను అనుమతించబోము.. బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు జిహాద్ జరగకుండా చూస్తామని ఆ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే (Nitish rane) అన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోనని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం తన మతం, ధర్మం, సమాజానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ‘నా జనన ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రంపై హిందువు అని రాస్తాను. నా మతాన్ని, ధర్మాన్ని రక్షించినందుకు నాపై ద్వేషపూరిత నేరం మోపబడితే, అందులో తప్పు లేదు. దానికి భయపడబోను’ అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటు జిహాద్ జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అలా జరగకుండా చూస్తామని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తూ మరోవైపు కేంద్ర పథకాలన్నింటినీ ఎందుకు సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ నెల 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సింధుదుర్గ్ జిల్లా కంకావ్లి స్థానం నుంచి నితిశ్ రాణే బరిలో నిలిచారు. ఆయనపై ఇప్పటికే ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

Next Story

Most Viewed