- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiran Kumar Chamala: నీది రా కుట్ర.. నీ అయ్యది రా కుట్ర! కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: కొండగల్ పరిధిలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనపై కేటీఆర్ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
‘నీది రా కుట్ర.. నీ అయ్యది రా కుట్ర, తరతరాలకు సరిపోయే భూమిని ఒక దశాబ్దంలోనే దోచిన.. నీది రా కుట్ర.. నీ కుటుంబానిది రా కుట్ర. ఫాంహౌస్ ల కోసమో.. రిసార్టుల కోసమో కాదు రా.. ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టికి మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీది రా కుట్ర, పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసి.. బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన మీది రా కుట్ర. మల్లన్న సాగర్‌ను కన్నీటి సాగర్‌గా మార్చిన మీదిరా కుట్ర. రంగ నాయక సాగర్‌ను రక్తాలు పారే సాగర్‌గా మార్చిన మీది రా కుట్ర. అరెస్టు.. అరెస్టు.. అరెస్టు అని తెగ కలవరిస్తున్నావు, ఇది కదా నీ అసలు భయం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.