బకాయిల చెల్లింపు తర్వాతనే కొత్త సర్వే చేయించాలి..

by Aamani |
బకాయిల చెల్లింపు తర్వాతనే కొత్త సర్వే చేయించాలి..
X

దిశ, ఆదిలాబాద్: ఆశా వర్కర్లకు పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు వారితో చేయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ మాట్లాడుతూ ఈ డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సర్వే చేయాలని ఆశలకు జిల్లా అధికారులు చెబుతున్నారని అన్నారు.

ఇందులో భాగంగా వారికి లెప్రసీ సర్వే కోసం శిక్షణ కూడా ప్రారంభించారని తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే వీరితో కొత్త సర్వేలు చేయించాలని కోరారు. అంతవరకు వీరితో ఎలాంటి సర్వేలు చేయించరాదని పేర్కొన్నారు లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందులో యూనియన్ అధ్యక్షురాలు నైతం శోభ, జిల్లా కార్యదర్శి సునీత, ఆశా వర్కర్లు, సిఐటియు, నాయకులు పుష్ప, లక్ష్మీ, సంగీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed