బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. మహిళా ఎమ్మెల్యేపై కేసు నమోదు!

by Anjali |   ( Updated:2024-07-03 09:38:31.0  )
బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు..  మహిళా ఎమ్మెల్యేపై కేసు నమోదు!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇవాళ హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ రోజురోజుకి ముదురుతోంది. కోమరభీం జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరింది. ఈ ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీశాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోవా లక్ష్మిపై పోలీసులు 296(B), 351(2) సెక్షన్ల కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story