ఆదిలాబాద్ అభివృద్ధికిరూ.10 కోట్ల నిధులు విడుద‌ల

by Aamani |
ఆదిలాబాద్ అభివృద్ధికిరూ.10 కోట్ల నిధులు విడుద‌ల
X

దిశ, ఆదిలాబాద్ : సీఆర్ఆర్ ప్లేన్ గ్రాంట్స్ కింద ఆదిలాబాద్ నియోజ‌క వ‌ర్గానికి బీటి రోడ్, బ్రిడ్జి ప‌నుల నిమిత్తం రూ.10 కోట్లు విడుద‌ల అయ్యాయి.ఈ మేరకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి బుధవారం నిధుల వివరాలు తెలియజేశారు. గ‌తంలో నియోజ‌క వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల కోసం నిధులు మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కి పంచాయ‌తీ రాజ్ , స్త్రీ మ‌హిళా శిశుసంక్షేమ శాఖా మంత్రి ,జిల్లా ఇంఛార్జి మంత్రి సీత‌క్క‌కు లేఖ‌ల ద్వారా ప్ర‌పోజల్స్ పంపిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతంరూ. 10 కోట్లు విడుద‌ల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి , రాష్ట్ర,ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీత‌క్క‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అతి త్వ‌ర‌లోనే ప్ర‌పోజ‌ల్స్ లో మిగ‌తా అభివృద్ధి ప‌నులకు నిధులు దాదాపురూ. 120 కోట్ల వ‌ర‌కు విడుద‌ల అయ్యే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న తెలిపారు.అయితే ఈ నిధుల ద్వారా నియోజక వర్గంలోనీ ఆదిలాబాద్ రూరల్,జైనథ్,బేల మండలాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు.

Advertisement

Next Story